ఆయన అక్రమ సంబంధమే మా విడాకులకు కారణం..

by Web Desk |
ఆయన అక్రమ సంబంధమే మా విడాకులకు కారణం..
X

దిశ, సినిమా: టెలివిజన్ స్టార్ నిషా రావల్ ప్రస్తుతం కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'లాక్‌ అప్‌' రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. కరణ్ మెహ్రాతో విడాకుల గురించి చెబుతూ భావోద్వేగానికి లోనైంది. తన జీవితంలో ఊహకందని చేదు అనుభవాలు ఎదురయ్యాయని నిషా.. పాయల్‌ రోహత్గీతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, తన కుమారుడు కవిష్‌ను ఒంటిరిగా వదిలేసి కరణ్ ముంబై వెళ్లిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే పాయల్‌తో వివాహేతర సంబంధాన్ని అనుమతించాలని తనను వేధించడం మానసికంగా గాయపరిచిందన్న ఆమె.. అందుకే విడాకులు తీసుకున్నానంటూ వివరించింది.




Next Story

Most Viewed