- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nirmala Sitharaman: బయటపడ్డ ప్రముఖ మొబైల్ సంస్థల మోసాలు.. నోటీసులు ఇచ్చిన కేంద్రం
Nirmala Sitharaman Says, Notices Issued to three Chinese Mobile Companies for Tax Evasion| పన్ను ఎగవేత ఆరోపణలపై దేశంలోని ప్రముఖ మొబైల్ సంస్థలను నోటీసులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చైనాకు చెందిన మూడు మొబైల్ సంస్థలు

దిశ, వెబ్‌డెస్క్: Nirmala Sitharaman Says, Notices Issued to three Chinese Mobile Companies for Tax Evasion| పన్ను ఎగవేత ఆరోపణలపై దేశంలోని ప్రముఖ మొబైల్ సంస్థలను నోటీసులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. చైనాకు చెందిన మూడు మొబైల్ సంస్థలు పాల్పడుతున్న పన్ను ఎగవేత విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఈ విషయంపై తగిన చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. క్వశ్చన్ అవర్‌లో భాగంగా సీతారామన్ ఈ విషయాన్ని రాజ్యసభలో తెలిపారు. ఇందుకు సంబంధించిన మూడు సంస్థలకు రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు పంపిందని, కస్టం డ్యూటీలో స్వల్ప చెల్లింపులకు దారితీసే కొన్ని వస్తువుల సంఖ్యలను తప్పుగా ప్రకటించడం వంటివి ఈ సంస్థలు చేశాయని, తద్వారా కోట్ల పన్నును ఎగ్గొట్టాయన పేర్కొన్నారు. 'టాక్స్ ఎగ్గొట్టిన కారణంగా చైనా మొబైల్ సంస్థలు వివో ఇండియా, ఒప్పో, షియోమీ సంస్థలకు నోటీసులు పంపించాం. వాటిలో ఒప్పో సంస్థకు రూ.4,389 కోట్ల కస్టమ్ డ్యూటీకి సంబంధించిన నోటీలు ఇచ్చాం. అదే విధంగా షియోమీకి మూడు షోకాజ్ నోటీసులు పంపాం. అవి దాదాపు రూ.653 కోట్ల విధి బాధ్యతకు సంబంధించినవి' అని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: మంకీ పాక్స్ కొత్త వ్యాధి కాదు.. భయపడకండి: కేంద్ర మంత్రి






