నామీద నాసిరకం జోకులు వేశారు : బాలీవుడ్ బ్యూటీ Nimrat Kaur ఆవేదన

by Dishanational2 |
నామీద నాసిరకం జోకులు వేశారు : బాలీవుడ్ బ్యూటీ Nimrat Kaur ఆవేదన
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ నిమ్రత్ కౌర్ తన వయసు, శరీరంపై నాసిరకం జోకులు వేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల 'దస్వి' చిత్రంలో ముఖ్యమంత్రిగా కనిపించిన ఆమె.. తాజా సమావేశంలో ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకుంది. సినిమా కోసం 15 కిలోల బరువు పెరిగి, మళ్లీ తగ్గడం సవాల్‌గా మారిందన్న ఆమె.. ఈ క్రమంలో బరువు, వయసుపై నెగెటివ్ కామెంట్లు బాధించాయని తెలిపింది. అలాగే ఈ మధ్య 40 దాటిన నటులు ప్రయోగాలు చేయడంపై కొంతమంది అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, అలాంటి వాళ్లది 'అత్యంత కాలం చెల్లిన నాసిరకం పద్ధతి' అంటూ సెటైర్ వేసింది. ఇక జీవితంలో జరిగే ఏ ప్రక్రియ అయినా నెమ్మదిగా జరుగుతుందని, దానికి ఓపిక పట్టడమే ప్రధానమని నేర్చుకున్నట్లుగా పేర్కొంది. అయితే, ఎవరేం అనుకున్నా తన శరీరంపై విపరీతమైన గౌరవాన్ని పెంచుకున్నానన్న నిమ్రత్.. ఏదైనా శ్రద్ధగా వింటూ పూర్తిగా అర్థం చేసుకుని అవసరమైనదే తీసుకోవాలని సూచించింది.


Next Story