ప్లాస్టిక్, టెక్స్‌టైల్ వేస్ట్‌తో ఫ్యాషన్ యాక్సెసరీస్

by Web Desk |
ప్లాస్టిక్, టెక్స్‌టైల్ వేస్ట్‌తో ఫ్యాషన్ యాక్సెసరీస్
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్‌ను ఫాలో అవడమే బిగ్గెస్ట్ టాస్క్. ఇక వేగంగా మారిపోయే ఫ్యాషన్ నార్మ్స్‌ను అందుకునేందుకు డిజైనర్లు నిత్యం పోటీపడాల్సి ఉంటుంది. కానీ ఈ పోటీలో పుట్టుకొస్తున్న ఉత్పత్తులు కాలుష్యానికి కారణమవుతున్నాయి. కొంతమంది డిజైనర్లు మాత్రమే ఫ్యాషన్‌కు సస్టెయినబిలిటీని జోడించి పర్యావరణ సమస్యలకు పరిష్కారం చూపుతుండగా.. నైజీరియాకు చెందిన అడెజోక్ లసీసి కూడా అటువంటి డిజైనరే.

ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యావరణ అనుకూల ఉత్పత్తులుగా మార్చే 'ప్లానెట్ 3R' కంపెనీలో పనిచేస్తున్న లసీసి.. వాడిపడేసిన ప్లాస్టిక్, పనికిరాని వస్త్ర వ్యర్థాలను ఉపయోగించి ఫ్యాషన్ ప్రొడక్ట్స్ తయారుచేస్తోంది. ఇందుకోసం సేకరించిన పాలిథిన్స్, ప్లాస్టిక్ సీసాలు, ప్యాకేజింగ్స్‌ను ముందుగా ఆరబెట్టి, ముక్కలుగా కత్తిరిస్తుంది. ఆ తర్వాత ఈ ప్లాస్టిక్‌ ముక్కలతో పాటు కొన్ని వస్త్ర వ్యర్థాలతో 'అసో-ఓకే'గా పిలువబడే సాంప్రదాయ యొరుబా ఫాబ్రిక్‌ను అద్భుతంగా నేస్తుంది. ఈ విధంగా ఆమె రూపొందించిన రీసైకిల్ ఫ్యాబ్రిక్‌ను బ్యాగ్‌లు, బట్టలు, ఇతర ఫ్యాషన్ ఉపకరణాల తయారీకి ఉపయోగిస్తుంది.

ఈ ఇనిషియేటివ్స్‌పై స్పందించిన లసీసి.. 'చాలా మంది వ్యర్థాలను డంప్ చేయడం, కాల్చడం వల్ల పర్యావరణం, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అందుకే అమ్మ దగ్గర నేర్చుకున్న వీవింగ్ స్కిల్స్‌తో వ్యర్థాలను రీసైకిల్ చేయడం ప్రారంభించాను. ఇప్పుడు ఉత్పత్తులను సృష్టించడమే కాక సాధికారత అవకాశాలను కల్పించడం సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. కాగా లసీసి ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డాయి. ఈ మేరకు 2020లో 'ఆఫ్రికా గ్రీన్ గ్రాంట్' అవార్డ్ గెలుచుకుంది. ఇక తన యాక్టివిటీస్ గురించి సోషల్ మీడియాలోనూ పంచుకోగా.. చాలా మంది ఆమె అనుసరిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల నుంచి ప్రేరణ పొందుతున్నారు.


Next Story