బాల్క సుమన్ అరెస్ట్ వార్తలు అసత్యం: బీఆర్ఎస్

by Malleboina Mahesh |   (  Updated:2026-05-30 06:54:37  IST  )

నేత బాల్క సుమన్ అరెస్ట్ వార్తలను ఖండించిన బీఆర్ఎస్.. తెలంగాణ భవన్‌లోనే ఉన్నాడని ప్రకటన విడుదల.

బాల్క సుమన్ అరెస్ట్ వార్తలు అసత్యం: బీఆర్ఎస్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌ (Balka Suman)ను శనివారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారని వస్తున్న వార్తలపై ఆ పార్టీ స్పందించింది. సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న అరెస్ట్ వార్తలు పూర్తిగా అసత్య ప్రచారమని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తమ నేత ఎక్కడికీ వెళ్లలేదని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లోనే అందుబాటులో ఉన్నాడని బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. మరోపక్క బాల్క సుమన్ ను పోలీసులు అరెస్టు చేశారని, నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం తెలియాలంటే పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మిలిటెంట్ తరహా ఉద్యమ పిలుపే కారణం!

ఇటీవల జరిగిన బీఆర్ఎస్ నేతల అంతర్గత సమావేశంలో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు సాషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిరసనలు తెలిపేందుకు రైతులు, కార్మికులు రావడం లేదని.. బీఆర్ఎస్ నేతలే స్వయంగా మిలిటెంట్ తరహా ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే రోడ్లపై గొడవలు చేయాలని, సింగరేణి ఆఫీసును ధ్వంసం చేయాలంటూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. హింసను ప్రేరేపించే విధంగా ఉన్న ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

Next Story