తల్లి కాబోతున్న నయనతార..? ట్వీస్ట్ ఏంటంటే..

by Satheesh |

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ నయనతార గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది.- latest Telugu news

తల్లి కాబోతున్న నయనతార..? ట్వీస్ట్ ఏంటంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ నయనతార గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ హాట్ బ్యూటీ త్వరలో తల్లి కాబోతోందంటూ సినీ సర్కిల్స్‌లో వార్తలు కోడైకుస్తు్న్నాయి. ఇదిలా ఉంటే.. నయనతార గత రెండు సంవత్సరాలుగా దర్శకుడు విఘ్నేశ్‌తో సహజీవనం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ జోడి లాక్ డౌన్‌లో రహస్యంగా నిశ్చితార్ధం కూడా చేసుకున్నారు. అయితే, నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీ బిజీగా సమయం గడుపుతోంది.

దీనితో నయన్.. సరోగసి విధానం ద్వారా తల్లి అవ్వాలనుకుంటుదని.. ఇందుకు ఆమె ప్రియుడు విఘ్నేష్ కూడా ఓకే చెప్పినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా తాజాగా వీరిద్దరూ గుడికి వెళ్లి పూజలు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి కారణం ఈ వీడియోలో నయన్.. నుదట సింధూరం పెట్టుకుని దర్శనమివ్వడమే. ఇక దీనితో వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారని మరోసారి వార్తలు గుప్పుమంటున్నాయి.

Next Story