- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా సంఘాల పొదుపు నిధులు పక్కదారి..?
ముస్తాబాద్ మండలంలోని తూర్కపల్లి గ్రామంలో మహిళా సంఘాల పొదుపు నిధుల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ గ్రామ వివో జమున, ఆమె భర్త నగునూరి దుర్గాప్రసాద్‌పై గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు.

దిశ, ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలంలోని తూర్కపల్లి గ్రామంలో మహిళా సంఘాల పొదుపు నిధుల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ గ్రామ వివో జమున, ఆమె భర్త నగునూరి దుర్గాప్రసాద్‌పై గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ప్రజావాణిలో ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. మహిళలు కష్టపడి పొదుపు చేసిన నిధులను బ్యాంకులో జమ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, వాటిని వ్యక్తిగత అవసరాలకు వినియోగించారని ఆరోపించారు. గతంలో చిట్టీలు, చక్రవడ్డీ పేరుతో మహిళల నుంచి డబ్బులు వసూలు చేసి గోల్మాల్ చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
అలాగే మహిళా సంఘాల గ్రూపుల ఫారాలు నింపేందుకు ఒక్కో గ్రూపు నుంచి రూ.200 చొప్పున తప్పనిసరిగా వసూలు చేశారని ఆరోపించారు. దాదాపు 20కి పైగా గ్రూపుల నుంచి ఈ విధంగా డబ్బులు వసూలు చేసినట్లు మహిళలు తెలిపారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, మహిళల పొదుపు నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వివో జమునను విధుల నుంచి తొలగించి, ఆ స్థానంలో ఎస్సీ వర్గానికి చెందిన అర్హత కలిగిన మహిళకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
అధికారుల స్పందన పెండింగ్..
అయితే, ఇవి గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు చేసిన ఆరోపణలు మాత్రమే. ఈ అంశంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వివో జమున, ఆమె భర్త నుంచి ఈ ఆరోపణలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది.






