- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భీంగల్‌లో నూతన కోర్టు ప్రారంభం
భీంగల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ తంగిరాల మాధవీ దేవి ప్రారంభించారు.

దిశ, భీంగల్ : భీంగల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టును ఆదివారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి, నిజామాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ తంగిరాల మాధవీ దేవి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి నూతన న్యాయస్థానాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె కోర్టు భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జస్టిస్ తంగిరాల మాధవీ దేవి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాల ప్రజలకు న్యాయసేవలను మరింత చేరువ చేయడంలో స్థానికంగా కోర్టుల ఏర్పాటు కీలకమని అన్నారు.
భీంగల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఇకపై కోర్టు పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సమయం, ఆర్థిక వ్యయం ఆదా అవుతుందని తెలిపారు. వ్యాజ్యదారులకు త్వరితగతిన, సులభంగా న్యాయసేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీ నారాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్ భరత లక్ష్మి, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ చందర్, న్యాయవాదులు చైతన్య, సూర సురేష్, బార్ అసోసియేషన్ సభ్యులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.






