- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ - ఆస్ట్రియా మైత్రిలో నూతన అధ్యాయం.. ప్రధాని మోడీ, ఛాన్సలర్ స్టాకర్ కీలక ఒప్పందాలు
ప్రధాని మోదీ - ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్ భేటీ! టెక్నాలజీ, రక్షణ మరియు నర్సింగ్ రంగాల్లో కీలక ఒప్పందాలు. 'వర్కింగ్ హాలిడే ప్రోగ్రామ్' ప్రారంభం.

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రియా ఛాన్సలర్ డాక్టర్ క్రిస్టియన్ స్టాకర్ (Christian Stalker) తన మొదటి అధికారిక భారత పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)తో సమావేశమయ్యారు. ఈ భేటీ రెండు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసే దిశగా సాగింది. ఆస్ట్రియాకున్న సాంకేతిక నైపుణ్యాన్ని, భారత్ వేగం, విస్తృతిని (Speed and Scale) మేళవించి ప్రపంచానికి నమ్మకమైన సప్లై చైన్, టెక్నాలజీని అందించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ముఖ్యంగా రక్షణ, సెమీకండక్టర్లు, క్వాంటం, బయోటెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేయాలని నిశ్చయించుకున్నాయి.
ఈ సందర్భంగా విద్యా, ఉపాధి రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. IIT ఢిల్లీ, ఆస్ట్రియాకు చెందిన మోంటన్ యూనివర్సిటీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని (MoU) ప్రధాని మోడీ ప్రశంసించారు. అలాగే, నర్సింగ్ రంగంలో నిపుణులైన మానవ వనరుల రాకపోకలను సులభతరం చేసేందుకు యువతకు ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు "ఇండియా-ఆస్ట్రియా వర్కింగ్ హాలిడే ప్రోగ్రామ్" ను నేడు అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుత ప్రపంచ ఉద్రిక్తతల నేపథ్యంలో, సైనిక సంఘర్షణల ద్వారా సమస్యలు పరిష్కారం కావని, ఉక్రెయిన్- పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో శాశ్వత శాంతి నెలకొనాలని ఇరు నేతలు ఆకాంక్షించారు.






