- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ ప్రయాణికుల కోసం కొత్త యాప్
ఆర్టీసీ ప్రయాణికుల కోసం టీజీఎస్ఆర్టీసీ కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో : టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సౌలభ్యం కోసం మీసేవ మీ టికెట్ మొబైల్ యాప్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణీకులు సుదూర ప్రయాణాలు, ఇంటర్‌సిటీ బస్సు టిక్కెట్లను డిజిటల్‌గా బుక్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. మంగళవారం సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , రవాణా శాఖ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్ , ఎండీ నాగిరెడ్డి , మీసేవ కమీషనర్ రవికిరణ్ తో కలిసి మీ మొబైల్ ఆప్ ను ఆవిష్కరించారు. ఈ సరికొత్త విధానం ద్వారా మీ టికెట్ మొబైల్ యాప్ ఓపీఆర్ఎస్సేవలను కూడా అనుసంధానిస్తుంది. యాప్ ద్వారా 1710 ఓపీఆర్ఎస్సేవలు, ఏసీ సేవలు 450, నాన్ ఎసీ సేవలు: 1,260, రోజువారీగా బుకింగ్ ఆయ్యే సీట్లు 13 వేలు బుకింగ్చేసుకోవచ్చు. బెంగళూరు, తిరుపతి, విశాఖ పట్నం, విజయవాడ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్జిల్లాలకు సౌకర్యం కల్పించారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ఐదు రకాల బస్ పాస్‌లు పొందే సౌకర్యం అమలు చేశారు. టికెట్ మొబైల్ యాప్ ద్వారా ఇప్పుడు ఐదు కేటగిరీల సిటీ బస్ పాస్‌లు డిజిటల్‌గా అందుబాటులో ఉన్నాయి. ఆర్టీసీ బస్ పాస్ మాడ్యూల్ హైదరాబాద్ నగరంలోని ప్రయాణీకులకు మొబైల్ యాప్ ద్వారా నెలవారీ బస్ పాస్‌లను డిజిటల్‌గా తీసుకోవడానికి, పునరుద్ధరించడానికి వీలు కల్పిస్తుంది.
సిటీ ఆర్డినరీ నెలకు పాస్ రూ. 1,400 కాగా సగటు నెలవారీ 8 వేలు అమ్మకాలు, మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ రూ. 1600 సగటు నెలవారీ 46,500 పాసులు జారీ, మెట్రో డీలక్స్ పాస్ రూ.1,800 నెల రూ. 12 వేలు, గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ పాస్రూ. 220 కాగా నెలవారీ 100 పాస్ అమ్మకాలు అవుతాయి. పుష్పక్ ఏసీ ధర రూ. 5,000 కాగా నెలకు 450 జారీ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో కార్యకలాపాల కోసం టీ24 టికెట్‌ను మీ టిక్కెట్మొబైల్ యాప్‌లో విలీనం జరిగింది. టి 24 టికెట్ అనేది 24 గంటల డిజిటల్ ట్రావెల్ పాస్, ఇది యాక్టివేషన్ సమయం నుండి సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ మరియు మెట్రో డీలక్స్ బస్సు సర్వీసులలో అపరిమిత ప్రయాణం చేసేందుకు అనుమతి ఉంటుంది. ఈటిక్కెట్లు రోజువారీ సగటు 16,830 అమ్మకాలు పెద్దలకు రూ. 130, పిల్లలకు రూ. 90, మహిళలు, ఇతర రాష్ట్రాలు, సీనియర్ సిటిజన్ కు రూ.110 ఉంటుంది. టీ 24 టికెట్ పర్యాటకులకు, అప్పుడప్పుడు ప్రయాణించేవారికి ఒకే రోజులో చాలా ప్రాంతాలు తిరిగే ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
- Tags
- TGSRTC






