- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ స్టింగ్ ఆపరేషన్.. బట్టబయలైన కల్తీ పాల నయా దందా
నెల రోజులుగా దిశ దినపత్రిక నిర్వహిస్తున్న స్టింగ్ ఆపరేషన్‌లో కల్తీ పాల వ్యాపారుల అక్రమాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి.

దిశ, సూర్యాపేట: నెల రోజులుగా దిశ దినపత్రిక నిర్వహిస్తున్న స్టింగ్ ఆపరేషన్‌లో కల్తీ పాల వ్యాపారుల అక్రమాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. పల్లెటూరి నుంచి తెచ్చిన స్వచ్ఛమైన పాలు అంటూ వినియోగదారులను నమ్మించి, వాటిలో మున్సిపల్ నీరు కలిపి విక్రయిస్తున్న ఓ పాల వ్యాపారి వ్యవహారం దిశ కెమెరాకు చిక్కింది. కొంతకాలంగా కల్తీ పాల వ్యాపారం పై నిఘా పెట్టిన దిశ రిపోర్టర్, బుధవారం నిర్వహించిన గోప్య విచారణలో పాలలో నీరు కలుపుతున్న దృశ్యాలను చిత్రీకరించారు. కెమెరా గమనించిన వ్యాపారి అక్కడి నుంచి పరారయ్యాడు.
పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ప్రతిరోజూ పెద్దఎత్తున కల్తీ పాల విక్రయాలు జరుగుతున్నప్పటికీ, సంబంధిత శాఖలు ఇప్పటి వరకు సమగ్ర చర్యలు చేపట్టకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లెటూరి నుంచి వచ్చి తక్కువ ధరకే పాలు విక్రయిస్తున్న కొందరు వ్యాపారుల పై ఫిర్యాదులు రావడంతో దిశ ఈ అంశం పై ప్రత్యేక దృష్టి సారించింది. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందేందుకు కొందరు పాలలో మున్సిపల్ నీరు కలిపి విక్రయిస్తున్నట్లు స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది. ఈ పాలను చిన్నారులు, వృద్ధులు సహా అనేక కుటుంబాలు వినియోగిస్తుండటంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
దిశ స్టింగ్ ఆపరేషన్‌తో బయటపడిన ఈ వ్యవహారం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆహార భద్రతా శాఖ, మున్సిపల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి, కల్తీ పాల విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే కల్తీ ఆహార వ్యాపారాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని సామాజిక వర్గాలు కోరుతున్నాయి. అధికారులు స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.






