శివాత్మిక అందానికి నెటిజన్లు ఫిదా.. అచ్చం దేవతలా ఉందంటూ..

by Disha Web Desk 12 |
శివాత్మిక అందానికి నెటిజన్లు ఫిదా.. అచ్చం దేవతలా ఉందంటూ..
X

దిశ, సినిమా : జీవిత రాజశేఖర్ దంపతులు చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్ 'దొరసాని' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా.. నటిగా శివాత్మికకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా తన ఎక్స్‌ప్రెషన్స్‌కు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం తను కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న 'రంగ మార్తాండ' చిత్రంలో నటిస్తుండగా.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌ ఇస్తున్నారు. దీంతో ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరగనుందని చిత్రబృందం భావిస్తోంది. ఇక 'నా మూవీకి మెగా వాయిస్ అందిస్తున్నందుకు అన్నయ్య చిరంజీవికి థాంక్స్ చెబుతున్నాను' అంటూ ఆ మధ్య కృష్ణవంశీ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ కూడా చేశారు. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో కనిపించనుండగా.. రీసెంట్‌గా విడుదల చేసిన శివాత్మిక పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తను చూడటానికి అచ్చం దేవతలా ఉందంటున్న నెటిజన్స్.. ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

Next Story

Most Viewed