- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బేబీ ప్రోడక్ట్స్ రీకాల్... నెస్ట్లేలో ఏం జరుగుతోంది?
శిశువుల్లో వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ ఆహారపదార్థాల కంపెనీ నెస్ట్లే (Nestlé) తాజాగా కొన్ని ప్రోడక్ట్స్ ను రీకాల్ చేయడం కలకలం రేపుతోంది. జనవరి 6న నెస్ట్లే కొన్ని రకాల బేబీ ఫార్ములా పాల ప్రొడక్ట్స్‌ను గ్లోబల్ స్థాయిలో రీకాల్ చేసింది. అంతేకాదు తాము ప్రకటించిన ప్రొడక్ట్స్ ను కొనకూడదు, అమ్మకూడదు అంటూ నేడు మరో ప్రకటన జారీ చేసింది. ఇప్పటికే యూరప్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడాతో సహా మొత్తం 25 నుంచి 60 దేశాల్లో బేబీ ఫార్ములా మిల్క్ ప్రొడక్ట్స్ అమ్మకాలను ఉన్నపళంగా నిలిపివేసి, రీకాల్ చేపట్టారు. దీంతో అసలు నెస్ట్లేలో ఏం జరుగుతుందో తెలియక ఆయా ప్రోడక్ట్స్ వాడుతున్న ప్రజలు ఆందోళన గందరగోళానికి గురవుతున్నారు.
ఇంతకీ ఏం జరిగింది?
బేబీ ఫార్ములాలో బ్యాసిలస్ సెరియస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే సెరూలైడ్ టాక్సిన్ ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో ఈ రీకాల్ చేశారని నిపుణులు చెబుతున్నారు. ఈ టాక్సిన్ వల్ల చిన్న పిల్లల్లో వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తున్నట్టు కంపెనీ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రీకాల్ చేసిన బ్రాండ్లలో SMA, BEBA, NAN, Guigoz, Lactogen Harmony, Alfamino వంటి టాప్ మిల్క్ పౌడర్లు ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ ను తక్షణమే వెనక్కి పంపాలని, వీటిని ఇప్పటికే వాడుతున్నవారు పక్కన పెట్టాలని నెస్ట్లే విన్నవించింది.
భారత్ పై ఎఫెక్ట్ ఎంత?
భారత్‌లో ఇప్పటివరకు రీకాల్ సమాచారం లేకపోయినా.. గ్లోబల్ రీకాల్ కావడంతో FSSAI పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. భారత్‌లో ఈ ప్రొడక్ట్స్ వాడుతున్న తల్లిదండ్రులు బ్యాచ్ నంబర్, ఎక్స్‌పైరీ తేదీలను తప్పకుండా చెక్ చేయాలని సూచించింది. నెస్ట్లే ప్రకటించిన బ్యాచ్ ఉంటే వెంటనే వాటిని వాడకుండా రిటర్న్ చేయాలి లేదా పారేయాలని పేర్కొంది. శిశువుల ఆరోగ్యం అత్యంత కీలకం కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.






