- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ పోటీలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. మరికొద్ది సేపట్లో కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించనుండటంతో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికి వారే అంచనాకు వస్తున్నారు.

దిశ, వరంగల్ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ మొదలైంది. నేడు కౌంటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటించనుండటంతో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరికి వారే అంచనాకు వస్తున్నారు. భారీగా డబ్బులు ఖర్చు పెట్టిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పోల్ అయిన ఓట్లను బట్టి ఇప్పటికే గెలుపు ఓటములపై ఒక నిర్ణయానికి వచ్చారు. గెలుపు మీద నమ్మకంతో ఉన్న అభ్యర్థులు ఫలితాలు ప్రకటించగానే ర్యాలీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
12 మున్సిపాలిటీల్లో..
ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. హోరాహోరీగా ప్రచారం చేసి భారీగా ఖర్చుపెట్టిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. కొన్నివార్డుల్లో ఓట్లు వేసినా అభ్యర్థులకు ఓటరు నాడి అంతుచిక్కకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వార్డుల వారీగా పోలైన ఓట్లను బట్టి అంచనాకు వస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరా తీయడంతో పాటు కౌంటింగ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 12 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా తలపడ్డారు.
ఎవరికి వారే ఈ ఎన్నికల కోసం అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. గెలుపు ఓటములు సహజమైనా వార్డుల్లో భారీగా ఖర్చు పెట్టిన వారు ఆందోళన చెందుతున్నారు. నేడు ఫలితాలు వెలువడనుండడంతో ఆయా పార్టీల నేతలు కూడా అప్రమత్తం అయ్యారు. గెలిచిన వెంటనే కౌన్సిలర్లను క్యాంపులకు తరలించే విధంగా ఏర్పాట్లను చేసుకుంటున్నారు. కొన్ని మున్సిపాలిటీల పరిధిలో గట్టి పోటీ ఉండటం, ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎవరికి వారే అప్రమత్తం అయ్యారు. కొన్ని మున్సిపాలిటీల పరిధిలో కౌంటింగ్ కు ముందే అభ్యర్థులను క్యాంపులకు తరలించి ఫలితాలను ప్రకటించిన తర్వాత ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
ఈనెల 16న మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక ఉండడంతో ఆరోజు నేరుగా అక్కడికే వచ్చే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం గెలుపుపై ధీమాతో ఉన్నారు. పూర్తిస్థాయిలో క్యాంపు కోసం ఏర్పాట్లను చేస్తున్నారు. మొత్తంగా మున్సిపల్ ఫలితాలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.






