- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నకొండూరులో నేపాల్ యువకుడు ఆత్మహత్య
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో నేపాల్‌కు చెందిన కార్మికుడు ఉమేష్(20) అనే యువకుడు గురువారం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ, చౌటుప్పల్ టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో నేపాల్‌కు చెందిన కార్మికుడు ఉమేష్(20) అనే యువకుడు గురువారం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చౌటుప్పల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి.మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన ఉమేష్ చిన్నకొండూరు గ్రామ పరిధిలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో మాస్టర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత ఏడాది అతని భార్య నేపాల్‌లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు సమాచారం. దీంతో ఉమేష్ జీవనోపాధి కోసం చౌటుప్పల్‌కు వలస వచ్చి పనిచేస్తున్నాడు.
బుధవారం రాత్రి సుమారు 9 గంటలకు పనులు ముగించుకుని తన అద్దె గదిలోకి వెళ్లాడు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి యజమాని చిలువేరు శివ కుమార్ గది బయట లైట్ వెలుగుతుండటాన్ని గమనించి దానిని ఆపేందుకు లోపలికి వెళ్లగా, ఉమేష్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే స్థానికుల సహాయంతో అతడిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. ఉమేష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్న హిరువోడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మన్మథకుమార్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.






