- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంపాపేట్ ఫ్లైఓవర్ పనుల్లో నిర్లక్ష్యం?.. భారీ గుంతలో పడిన క్యారేజ్ ఆటో
చంపాపేట్–ఐఎస్ సదన్ ప్రధాన రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, చంపాపేట్: చంపాపేట్–ఐఎస్ సదన్ ప్రధాన రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిర్మాణ పనుల కోసం తవ్విన భారీ గుంతలో ఓ క్యారేజ్ ఆటో అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. నిర్మాణ ప్రాంతంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడం, ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. అదృష్టవశాత్తు ఆటో డ్రైవర్ సురక్షితంగా బయటపడడంతో పెను విషాదం తప్పింది. రోజూ వేలాది మంది ప్రయాణించే ఈ రహదారిపై ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నప్పటికీ, ప్రజల భద్రతను పక్కనపెట్టి పనులు నిర్వహిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు.
ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిర్మాణ ప్రాంతంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, బారికేడ్లు, రిఫ్లెక్టివ్ హెచ్చరిక బోర్డులు, రాత్రివేళల్లో వెలుతురు ఏర్పాట్లు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్థానికులు పలుమార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, మరో ప్రాణాపాయం సంభవించే లోపు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.






