స్కూల్ బస్సును ఢీకొన్న రైలు.. ముగ్గురు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం

by Malleboina Mahesh |

విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు బస్సును ఢీకొట్టడంతో ముగ్గురు మృతి.

స్కూల్ బస్సును ఢీకొన్న రైలు.. ముగ్గురు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్: విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును రైలు ఢీ కొట్టడంతో భారీ ప్రమాదం చోటు చేసుకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ సమీపంలో చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు బస్సును ఢీకొట్టింది. దీంతో ముగ్గు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరితో పాటు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారకులు అయిన గేట్ కీపర్, సూపర్వైజర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అలాగే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అప్రమత్తం అయిన ప్రభుత్వం గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story