- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్డీయే ప్రభుత్వం చర్చకు భయపడుతోంది: రాహుల్ గాంధీ
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం పార్లమెంట్ వేదికగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోని పరిణామాలపై రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం పార్లమెంట్ వేదికగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోని పరిణామాలపై రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను మాట్లాడుతుండగా ఎంపీలు అడ్డుకున్నారని, తాను మాట్లాడటం వారికి ఇష్టం లేదని, సభలో చర్చకు ఎన్డీయే ప్రభుత్వం భయపడుతోందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు.
నరవాణే పుస్తకం పై వివాదం
పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తున్న నరవాణే పుస్తకం వివాదంపై మాట్లాడుతూ.. మాజీ సైన్యాధిపతి జనరల్ నరవాణే రాసిన పుస్తకం గురించి నేను సభలో ప్రస్తావించకూడదని ప్రభుత్వం పదేపదే అడ్డుకుందని రాహుల్ ఆరోపించారు. మొదట పుస్తకాన్ని కోట్ చేయకూడదన్నారని, ఆ తర్వాత మ్యాగజైన్ గురించి మాట్లాడుతున్న ఒప్పుకోలేదని ఆయన పేర్కొన్నారు. చివరకు రక్షణ మంత్రి ఆ పుస్తకం అసలు ప్రచురణ కాలేదని అబద్ధం చెప్పారని, కానీ తమ దగ్గర ఆ పుస్తకం కాపీ ఉందని రాహుల్ స్పష్టం చేశారు.
విపక్షాల గొంతు నొక్కుతున్నారు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడిని, ఇతర సభ్యులను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అధికార పక్ష సభ్యులు పుస్తకాలను కోట్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా ఎవరు ఆపడం లేదని, విపక్షాలకు మాత్రం ఆ అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సభకు రావడానికి భయపడుతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. విపక్ష సభ్యుల వల్ల కాకుండా, తాను చెప్పబోయే నిజాలను ఎదుర్కోలేకనే ఆయన రావడం లేదన్నారు. ప్రధానిపై దాడులు జరుగుతాయనే ప్రచారంలో వాస్తవం లేదని, ఒకవేళ ఎవరైనా అలా బెదిరిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.
బడ్జెట్ చర్చపై ఆందోళన..
అమెరికా, భారతదేశం మధ్య కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం (US Deal)పై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. తాజా ట్రేడ్ డీల్ వల్ల రైతులపై పడే ప్రభావం గురించి చర్చ జరుగుతుందనే భయంతోనే ప్రభుత్వం బడ్జెట్‌పై చర్చను అడ్డుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రభుత్వం వెనకాడుతోందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా మీడియాతో చెప్పుకొచ్చారు. అంతకు ముందు రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతుండగా.. బీజేపీ, ఎన్డీయే కూటమి నేతలు పెద్ద ఎత్తున నిరసన చేసి.. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేస్తారు.






