ఎన్సీఈఆర్టీ సంచలన నిర్ణయం.. పాఠ్యపుస్తకం ఉపసంహరణ బహిరంగ క్షమాపణలు!

by Malleboina Mahesh |

8వ తరగతి సోషల్ టెక్స్ట్‌బుక్‌లోని 'న్యాయవ్యవస్థ' చాప్టర్‌పై NCERT బహిరంగ క్షమాపణ. పుస్తకాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు అధికారిక ప్రకటన.

ఎన్సీఈఆర్టీ సంచలన నిర్ణయం.. పాఠ్యపుస్తకం ఉపసంహరణ బహిరంగ క్షమాపణలు!
X

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) తాము ప్రచురించిన ఒక పాఠ్యపుస్తకంలోని అంశంపై బహిరంగ క్షమాపణలు కోరింది. ఇటీవల విడుదల చేసిన 8వ తరగతి సామాజిక శాస్త్రం (Social Science - Part II) పుస్తకం “Exploring Society: India and Beyond” లోని నాలుగో అధ్యాయం పై వివాదం చెలరేగింది. “The Role of Judiciary in our Society” (మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర) అనే పేరుతో ఉన్న ఈ అధ్యాయంలో పొందుపరిచిన కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని గుర్తించిన ఎన్సీఈఆర్టీ, తక్షణమే స్పందించి ఎటువంటి షరతులు లేని పూర్తిస్థాయి క్షమాపణలు తెలియజేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ వివాదం నేపథ్యంలో ఎన్సీఈఆర్టీ డైరెక్టర్, సభ్యులు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ, సదరు అధ్యాయం వల్ల కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేశారు. కేవలం క్షమాపణలతోనే ఆగకుండా, వివాదాస్పదమైన ఆ అధ్యాయం ఉన్న పూర్తి పుస్తకాన్ని మార్కెట్ నుంచి, విద్యాసంస్థల నుంచి తక్షణమే ఉపసంహరించుకుంటున్నట్లు (Withdrawn) ప్రకటించారు. ప్రస్తుతం ఈ పాఠ్యపుస్తకం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎక్కడా లభ్యం కాదని, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఎన్సీఈఆర్టీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Next Story