- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ నవజ్యోత్ కౌర్ సిద్ధూ సంచలన ప్రకటన
పంజాబ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నవజ్యోత్ కౌర్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నవజ్యోత్ కౌర్ సిద్ధూ (Navjot Kaur Sidhu) కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PPCC) అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌ను లక్ష్యంగా చేసుకుని (ట్విట్టర్) వేదికగా విరుచుకుపడ్డారు. రాజా వారింగ్‌ను "అత్యంత భయంకరమైన, అసమర్థుడైన, అవినీతిపరుడైన" అధ్యక్షుడిగా ఆమె అభివర్ణించారు. గత ఏడాది డిసెంబర్‌లో "ముఖ్యమంత్రి పదవి కోసం రూ. 500 కోట్ల సూట్‌కేసు అవసరం" అనే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆమె, ఇప్పుడు ఏకంగా రాజీనామా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
రాజా వారింగ్ తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి అమ్ముకున్నారని నవజ్యోత్ కౌర్ తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆయన పంజాబ్ ముఖ్యమంత్రితో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని, ఆ క్రమంలోనే కాంగ్రెస్‌ను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తనను నవజ్యోత్ సింగ్ సిద్ధూను రాజకీయంగా దెబ్బతీయడానికి వారింగ్ కుట్రలు చేస్తున్నారని, గత ఎన్నికల్లో సిద్ధూ ఓటమికి సహకరించిన నేతలకు పార్టీలో పెద్ద పదవులను కట్టబెట్టి ప్రోత్సహిస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. పార్టీలో సమర్థులైన నాయకులకు చోటు లేదని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) పంజాబ్ పర్యటనకు ముందే ఆమె రాజీనామా చేయడం, మోడీ పాలనను, ఆయన హయాంలోని పారదర్శకతను ప్రశంసించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. "మన దేశాధినేత రాష్ట్రానికి ఏదైనా ఇవ్వడానికి వస్తున్నప్పుడు, రాజకీయ దొంగలంతా ఏకమై అడ్డుకుంటున్నారు" అంటూ ప్రతిపక్షాలపై ఆమె మండిపడ్డారు. మోడీని ప్రేమపూర్వకంగా ఆహ్వానించాలని పంజాబ్ ప్రజలను కోరుతూనే, మరోవైపు రాజా వారింగ్ కేవలం 'సోషల్ మీడియా రీల్స్' చేసుకుంటూ నవ్వుల పాలవుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ పరిణామాలు సిద్ధూ దంపతులు తిరిగి తమ పాత పార్టీ అయిన బీజేపీలోకి వెళ్లే అవకాశాలను సూచిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read More..






