- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖానాపూర్‌లో ప్రకృతి బీభత్సం
by Batti.Sumithra |
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తనపల్లి గ్రామానికి చెందిన గొర్లకాపరి చౌటుపల్లి చిన్న మల్లేష్ తన గొర్రెల మందను మేతకు సారంగాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు.

X
దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సత్తనపల్లి గ్రామానికి చెందిన గొర్లకాపరి చౌటుపల్లి చిన్న మల్లేష్ తన గొర్రెల మందను మేతకు సారంగాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు.సోమవారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో పిడుగుపాటు సంభవించింది. ఈ ఘటనలో 11 గొర్రెలు, మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రకృతి బీభత్సానికి బలైన వాటిలో 6 మేకలు, 5 గొర్రెలు ఉన్నాయని బాధిత రైతు చౌటుపల్లి చిన్న మల్లేష్ తెలిపారు. మృతి చెందిన గొర్రెలు, మేకల విలువ సుమారు లక్ష రూపాయలకు పైగా ఉంటుందని ఆయన కన్నీటితో వాపోయారు. ఆకస్మికంగా జరిగిన ఈ నష్టంతో తీవ్రంగా నష్టపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్ట పరిహారం అందించాలని ఆయన కోరారు.
Next Story






