100 మీటర్ల పరుగు.. నేషనల్ రికార్డ్

by Muthe.Rajitha |

రాంచీ వేదికగా జరిగిన ఫెడరేషన్ కప్ ఫైనల్స్ రేసులో పంజాబ్‌కు చెందిన స్ప్రింటర్ గురీంద్వర్ సింగ్ సరికొత్త చరిత్రను సృష్టించాడు.

100 మీటర్ల పరుగు.. నేషనల్ రికార్డ్
X

దిశ, వెబ్ డెస్క్ : రాంచీ వేదికగా జరిగిన ఫెడరేషన్ కప్ ఫైనల్స్ రేసులో పంజాబ్‌కు చెందిన స్ప్రింటర్ గురీంద్వర్ సింగ్ సరికొత్త చరిత్రను సృష్టించాడు. పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న ఈ అథ్లెట్, కేవలం 10.09 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని సరికొత్త జాతీయ రికార్డును (New National Record) తన పేరిట లిఖించుకున్నాడు. భారత అథ్లెటిక్స్ చరిత్రలోనే ఈ అద్భుతమైన ప్రదర్శన ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా 100 మీటర్ల దూరాన్ని 10.09 సెకన్లలోనే పూర్తి చేయడం అనేది భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ రంగానికి దక్కిన గొప్ప విజయంగా క్రీడా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

గురీంద్వర్ సింగ్ సాధించిన ఈ అసాధారణమైన సూపర్ రికార్డు, భవిష్యత్తులో గ్లోబల్ ఈవెంట్లలో దేశానికి మరిన్ని పతకాలు తీసుకువచ్చేందుకు బాటలు వేయడమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది యువ అథ్లెటిక్స్ ఔత్సాహికులకు సరికొత్త స్ఫూర్తిని అందిస్తోంది. అయితే ఇదే టోర్నీలో సెమీస్ లో ఒడిశా అథ్లెట్ అనిమేష్ కుజుర్ 10.15 సెకన్లలో 100 మీటర్లు పూర్తి చేయగా.. ఈ రిక్కార్డును గురీంద్వర్ సింగ్ బద్దలు కొట్టాడు.

Next Story