- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ మెగా లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి
దిశ, మంథని: మంథని కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించే..National Mega Lok Adalat at Manthani Court premises

దిశ, మంథని: మంథని కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీధర్ తెలిపారు. శుక్రవారం లోక్ అదాలత్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ "రాజీ మార్గమే రాజా మార్గం "అనే నినాదంతో నిర్వహించే ఈ జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రాజీ కుదుర్చుకున్న కేసులను తీసేస్తామని తెలిపారు. భార్యాభర్తల కేసులు, భూ తగాదాల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కొట్టుకున్న తిట్టుకున్న కేసులు, రాజీ కుదుర్చుకునే సంబంధిత కేసులను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిబాబు, ప్రధాన కార్యదర్శి వెంకట్ రామ్ రెడ్డి, ఉపాధ్యక్షులు రమణ కుమార్ రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు బొట్ల ఆంజనేయులు, న్యాయవాదులు ఉప్పల సుభాష్, ఆర్ల నాగరాజు, కోర్టు కానిస్టేబుల్స్, సిబ్బంది పాల్గొన్నారు.






