రాష్ట్రానికి చేరుకున్న జాతీయ రైతు జాగృతి యాత్ర

by Muthe.Rajitha |

జాతీయ రైతు జాగృతి యాత్ర తెలంగాణకు చేరుకుంది. యాత్ర బృందం రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు.

రాష్ట్రానికి చేరుకున్న జాతీయ రైతు జాగృతి యాత్ర
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేశ వ్యాప్తంగా పంటలకు మద్దతు ధర తోపాటు చట్టభద్రత కల్పించాలనే డిమాండ్ తో జాతీయ రైతు సంఘాల నేతలు చేపట్టిన రైతు జాగృతి యాత్ర తెలంగాణకు చేరుకుంది. ఈనెల 7 న కన్యాకుమారి లో మొదలైన యాత్ర తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల మీదుగా రాష్ట్రానికి బృందం శుక్రవారం చేరుకుంది. వారికి తెలంగాణ రైతు సంఘం నేత నల్లమల్ల వెంకటేశ్వర రావు స్వాగతం పలికారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్న జాతీయ రైతు సంఘం నేతలు అన్నదాతకు వచ్చే సమస్యలను వివరిస్తున్నారు. సంయుక్త కిసాన్​మోర్చా నాన్​పొలిటికల్​జాతీయ కన్వీనర్​దల్జీత్ సింగ్ దల్లే వాల్ ఆధ్వర్యంలో యాత్ర సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర నుంచి కమిటీలో తనకు స్ధానం కల్పించినట్లు తెలిపారు. శనివారం రైతు కమిషన్​తో భేటీ కానున్నట్లు, అనంతరం రాష్ట్ర సీఎం రేవంత్​రెడ్డి కలిసి రైతుల సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కోరుతామన్నారు. యాత్ర ముగిసిన తరువాత మార్చి 19న ఢిల్లీలో మహా కిసాన్​పంచాయత్​పేరుతో లక్షల మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈయాత్రలో సంయుక్త కిసాన్ మోర్చా నాన్​పొలిటికల్​కమిటీ సభ్యులు అభిమన్యు , శాంత కుమార్ ,పిఆర్ పాండ్యన్ , రజ్వీర్ సింగ్ , అనిల్ పాల్గొన్నట్లు చెప్పారు.

Next Story