- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
జూలై 13న నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పిలుపునిచ్చారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : జూలై 13న నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమ నిర్వహణపై వైద్య, విద్య, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి అవసరమైన సూచనలు జారీ చేసినట్లు వెల్లడించారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 2,08,441 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 1–2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు అర మాత్ర, 2 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల వారికి ఒక పూర్తి మాత్ర అందజేయనున్నట్లు చెప్పారు. ఆల్బెండజోల్ మాత్రలు పూర్తిగా సురక్షితమైనవని, వాటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని స్పష్టం చేశారు. పిల్లలను నులి పురుగుల బారిన పడకుండా కాపాడేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వివరించారు.






