- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఎల్‌ఓ పై దాడి.. విధులకు ఆటంకం..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విపూ ఫంక్షన్ హాల్ సమీపంలో ఓటరు నమోదు విధులు నిర్వహిస్తున్న బీఎల్‌ఓ పై దాడి జరిగింది.

దిశ, కామారెడ్డిటౌన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విపూ ఫంక్షన్ హాల్ సమీపంలో ఓటరు నమోదు విధులు నిర్వహిస్తున్న బీఎల్‌ఓ పై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురి పై కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన బీఎల్‌ఓ అధికారి రాకూర్ అనిత(42) జూలై 10న ఎన్యుమరేషన్ విధులు నిర్వహిస్తుండగా ఉజ్మా బేగం ఫోటో లేని ఎన్యుమరేషన్ ఫారం సమర్పించింది. ఫోటో లేకపోవడంతో ఫారం స్వీకరించలేమని బీఎల్‌ఓ తెలిపారు. ఈ సమయంలో ఉజ్మా బేగం తాను బంగ్లాదేశ్‌కు చెందినదానినని చెప్పడంతో, నిబంధనల ప్రకారం ఫారం తీసుకోలేమని బీఎల్‌ఓ నిరాకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అసభ్యంగా దూషించి కిట్ లాక్కునే ప్రయత్నం..
దీంతో ఉజ్మా బేగం, మరో మహిళ కలిసి బీఎల్‌ఓ పై ఆటంకం కలిగిస్తూ అసభ్యంగా దూషించారు. చేతులు పట్టుకుని తోసివేయడంతో పాటు బీఎల్‌ఓ కిట్‌ను లాక్కునే ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు. అనంతరం అక్కడికి వచ్చిన మరో వ్యక్తి చంపేస్తాను అంటూ బెదిరించినట్లు ఫిర్యాదులో ఉంది. అక్కడే ఉన్న సూపర్‌వైజర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన పై కామారెడ్డి పట్టణ సీఐ నరహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.






