- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొబైల్ కొట్టేయబోయి.. రైలు కిటికీకి 9 కిలోమీటర్లు వేలాడిన దొంగ! తర్వాత ఏమైందంటే?
బిహార్‌లోని మాన్సి రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న జనహిత్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ఘటన చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్‌లోని మాన్సి రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న జనహిత్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ఘటన చోటుచేసుకుంది. రైలు కిటికీ పక్కన కూర్చున్న ప్రయాణికుడి మొబైల్ కొట్టేయడానికి ప్రయత్నించిన ఓ దొంగ ప్రయాణికులకు అడ్డంగా బుక్కయ్యాడు. కిటికీ బయట నుంచి ఫోన్ లాక్కొనేందుకు యత్నించగా.. లోపల ఉన్నవారు అప్రమత్తమై అతడి చేతిని గట్టిగా పట్టుకున్నారు. అంతలోనే రైలు కదలడంతో ఆ దొంగ కిటికీ బయటే గాల్లో వేలాడుతూ ఉండిపోయాడు. మాన్సి నుంచి ఖగారియా స్టేషన్ వరకు సుమారు 9 కిలోమీటర్ల దూరం ఆ దొంగ కదులుతున్న రైలుకు వేలాడుతూనే నరకయాతన అనుభవించాడు. రైలు వేగం పెరిగే కొద్దీ భయంతో వణికిపోతూ.. తనను వదిలేయాలని, ప్రాణాలు కాపాడాలని వేడుకున్నాడు. అయినప్పటికీ ప్రయాణికులు అతడిని వదలకుండా, అదే సమయంలో కింద పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని తదుపరి స్టేషన్‌లో జీఆర్పీ పోలీసులకు అప్పగించారు.
గతంలోనూ అనేక చోరీ కేసులు..
పోలీసుల విచారణలో నిందితుడు తన పేరును మార్చి చెప్పే ప్రయత్నం చేసినా.. చివరకు నౌగాచియాకు చెందిన బర్కత్ మన్సూరిగా నిర్ధారించారు. ఇతడిపై గతంలోనూ అనేక చోరీ కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దొంగను తప్పించుకోకుండా పట్టుకోవడమే కాకుండా, అతడు కిందపడి ప్రాణాలు కోల్పోకుండా మానవత్వంతో కాపాడిన ప్రయాణికుల సమయస్ఫూర్తిని నెటిజన్లు, రైల్వే అధికారులు తీవ్రంగా ప్రశంసిస్తున్నారు.






