- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రెగ్నెంట్ అవుతానని కలలో కూడా ఊహించలేదు.. యంగ్ బ్యూటీ
దిశ, సినిమా: బుల్లితెర నటి నటాషా శర్మ తల్లి కాబోతున్నానంటూ గుడ్‌న్యూస్ చెప్పింది. ..telugu latest news

దిశ, సినిమా: బుల్లితెర నటి నటాషా శర్మ తల్లి కాబోతున్నానంటూ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ ప్రకటన తర్వాత ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి వస్తున్న భారీ రెస్పాన్స్‌కు మనసు ఉప్పొంగుతోందని తెలిపింది. జంటల మధ్య విభేదాలు తలెత్తితే చాలా పెద్ద వార్తగా చెప్పుకునే జనాలు.. ప్రెగ్నెన్సీపై ఇంతటి ఆసక్తి చూపించడం ఆశ్చర్యంగా ఉందని రీసెంట్ మీడియా ఇంటరాక్షన్‌లో చెప్పింది. అయితే బిడ్డ కోసం ముందుగా ఎలాంటి ప్లానింగ్ లేదన్న నటాషా.. తల్లికాబోతుండటం దేవుని సంకేతంగా భావిస్తున్నామని, ఈ ఏడాది చాలా అందంగా మొదలైందని వెల్లడించింది. తాను గర్భందాల్చడం ఇదే మొదటిసారని, భర్త ఆదిత్య రెడిజ్‌తో కుటుంబాన్ని ప్రారంభించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. ఇక తన కడుపులో పెరుగుతున్న పాప.. తమ బంధాన్ని మరింత బలపరిచిందని, ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకునే విధానంలోనూ ఎంతో మార్పు వచ్చిందని వివరించింది.






