స్టార్ నటుడికి అరుదైన మెంటల్ డిజార్డర్.. నిద్రపోనివ్వడం లేదంటూ

by Disha Web Desk 12 |
స్టార్ నటుడికి అరుదైన మెంటల్ డిజార్డర్.. నిద్రపోనివ్వడం లేదంటూ
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ వెటరన్ యాక్టర్, పద్మశ్రీ, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత నసీరుద్దీన్‌షా దర్శకుడిగానూ మెప్పించారు. ఈ మేరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చెప్పాడు. తాజాగా ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ.. 'ఒనొమాటోమేనియా' అనే అరుదైన మానసిక వ్యాధి తనను వేధిస్తున్నట్లు తెలిపాడు.

ఈ వ్యాధిగ్రస్తులు ఏదైనా ఒక పదం, వాక్యం, పాట లేదా పద్యాన్ని మళ్లీ మళ్లీ పలుకుతుంటారు. ప్రస్తుతం నా పరిస్థితి అదే. ఇది నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు' అంటూ వివరించారు. ఇక ఇటీవలే విడుదలైన 'గెహ్రాయియా' చిత్రంలో కీలక పాత్ర పోషించిన షా.. ప్రస్తుతం 'కుట్టే' మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.

Next Story

Most Viewed