భూమిపైకి దూసుకొస్తున్న గ్రహశకలం.. అంతకు మూడు రెట్లు పెద్దది..

by Disha Web Desk 17 |
భూమిపైకి దూసుకొస్తున్న గ్రహశకలం.. అంతకు మూడు రెట్లు పెద్దది..
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ గ్రహశకలం ఒకటి ఏప్రిల్ ఫూల్స్ డే 2022 నాడు భూమికి అతి దగ్గరగా వస్తుందని NASA సైంటిస్ట్‌లు తెలిపారు. దీని పరిమాణం తాజ్ మహల్ కంటే 3 రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ భారీ గ్రహశకలాన్ని నాసా సైంటిస్ట్‌లు ట్రాక్ చేస్తున్నారు. ఇది గంటకు 30,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అధికారికంగా దీనికి 2007 FF1 అని పేరు పెట్టారు. NASA సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ (CNEOS) ప్రకారం, భారీ గ్రహశకలం శుక్రవారం (ఏప్రిల్ 1) నాడు భూమికి అత్యంత సమీపంగా చేరుకుంటుంది. ఇది దాదాపు 260 మీటర్లు లేదా దాదాపు 850 అడుగుల పరిమాణంలో ఉంటుంది. గ్రహశకలం దాదాపు భూమికి సమీపంలో 4.5 మిలియన్ మైళ్ల దూరంలో భూమిని దాటుతుందని భావిస్తున్నారు. దీని వలన ఎలాంటి ప్రమాదం లేనప్పటికి, శాస్త్రవేత్తలు భారీ గ్రహశకలాన్ని నిరంతరం ట్రాక్ చేస్తున్నారు.


Next Story

Most Viewed