ఓటీటీలోకి రాబోతున్న ‘నారి నారి నడుమ మురారి’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-30 13:36:09  IST  )

‘నారి నారి నడుమ మురారి’ (Nari Nari Naduma Murari)ఓటీటీ విడుదలకు ముహూర్తం ఖరారైంది.

ఓటీటీలోకి రాబోతున్న ‘నారి నారి నడుమ మురారి’.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
X

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand) హీరోగా, రామ్ అబ్బారాజు దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతి హిట్ చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ (Nari Nari Naduma Murari)ఓటీటీ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ, పెద్ద సినిమాల పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద సుమారు ₹34 కోట్ల గ్రాస్ వసూళ్లతో సూపర్ హిట్‌గా నిలిచింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, విడుదలైన నెలరోజుల లోపే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ​ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకోగా.. ఫిబ్రవరి 4 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘‘ప్రేమ, అబద్ధాలు గందరగోళంతో కూడిన ఈ కలయికను చూసేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఒకే ఇంట్లోని ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడి కథను దర్శకుడు అత్యంత హాస్యభరితంగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ​శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు అతిథి పాత్రలో మెరిసి సర్ ప్రైజ్ ఇచ్చారు. వెన్నెల కిశోర్, సత్య, నరేష్‌ల కామెడీ ట్రాక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. థియేటర్లలో ఈ ఫన్ రైడ్‌ను ఎంజాయ్ చేయలేకపోయిన వారు, ఫిబ్రవరి మొదటి వారం నుంచి తమ ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఈ సినిమాను చూడొచ్చు.

Next Story