- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > ఇంద్రకీలాద్రిపై నారా లోకేష్ ప్రత్యేక పూజలు: దుర్గమ్మ ఆశీస్సులు తీసుకున్న ఐటీ మంత్రి!
ఇంద్రకీలాద్రిపై నారా లోకేష్ ప్రత్యేక పూజలు: దుర్గమ్మ ఆశీస్సులు తీసుకున్న ఐటీ మంత్రి!
by Malleboina Mahesh |
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడ ఇంద్రకిలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలకగా, అమ్మవారి సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో శీనా నాయక్, పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, పాలకమండలి సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అనంతరం వారు లోకేష్‌ను అమ్మవారి సన్నిధికి తీసుకువెళ్లారు. దర్శనానంతరం లోకేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి వేద ఆశీర్వచనం అందించి, అమ్మవారి శేష వస్త్రం మరియు ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ పర్యటన సాగింది.
Next Story






