- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Naga Chaitanya: 'విరూపాక్ష' డైరెక్టర్‌తో నాగ చైతన్య సినిమా.. క్యూరియాసిటీ పెంచేస్తున్న పోస్టర్
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) త్వరలో ‘తండేల్’ (Tandel) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) త్వరలో ‘తండేల్’ (Tandel) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. చైతు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి-7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు అక్కినేని నాగచైతన్య బర్త్‌డే కావడంతో.. మరో మూవీ అప్‌డేట్ ఇచ్చాడు చైతు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో కలిసి బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 'విరూపాక్ష' మూవీతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలోనే రాబోతున్న ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ పోస్టర్‌లో ఒక అద్భుతమైన కన్ను ప్రతీకతో పాటు, రాక్ క్లైంబింగ్ టూల్స్‌తో ఓ పర్వతంపై నిలబడి ఉన్న నాగ చైతన్య కనిపించారు. ‘NC24’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీ డిసెంబరులో షూటింగ్ ప్రారంభంకానుంది. భారీ బడ్జెట్ (huge budget)తో, అత్యున్నత ప్రొడక్షన్ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ (First Look Poster) ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. కాగా.. చిత్రంలో నటీనటుల వివరాలు, ఇతర సమాచారం త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.






