పెళ్లి విషయంలో ఆ ట్రెండ్ ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత!

by Mallepaka Hamsa |   (  Updated:2024-11-25 10:34:53  IST  )

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు.

పెళ్లి విషయంలో ఆ ట్రెండ్ ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత!
X

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. డిసెంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారు. అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో గ్రాండ్‌గా ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభితలకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ జంట నయనతార(Nayanthara)ను ఫాలో అవుతూ తమ పెళ్లిని కూడా డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నట్లు టాక్.

ఇక దీని స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌(Netflix) సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన అక్కినేని అభిమానులు ఆనందపడుతున్నారు. కాగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార ఇదే ట్రెండ్‌ను ఫాలో అయి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రజెంట్ ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కూడా అవుతోంది. ఇక హన్సిక(Hansika) కూడా తన పెళ్లి వీడియోను ఓటీటీలో చూసేలా చేసింది. ఇక ఇప్పుడు నాగచైతన్య, శోభిత(Shobitha Dhulipala) కూడా అదే ఫాలో అవుతుండటం ఆసక్తిగా మారింది.


Also Read :

Sai Pallavi: క్రేజీ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి.. ఏకంగా గ్లోబల్ స్టార్‌తో రోమాన్స్..?


Next Story