Naga Chaitanya: గుడ్ న్యూస్ చెప్పిన నాగచైతన్య.. వేడుక జరుపుకోవడానికి ఎదురుచూస్తున్నానంటూ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-23 04:14:16  IST  )

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్ సినిమాల హవా కొనసాగుతోంది. ఒకప్పటి కల్ట్ క్లాసిక్ చిత్రాలను, బ్లాక్ బస్టర్ హిట్లను ప్రేక్షకులు మళ్లీ వెండితెరపై చూస్తూ సందడి చేస్తున్నారు.

Naga Chaitanya: గుడ్ న్యూస్ చెప్పిన నాగచైతన్య.. వేడుక జరుపుకోవడానికి ఎదురుచూస్తున్నానంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్ సినిమాల హవా కొనసాగుతోంది. ఒకప్పటి కల్ట్ క్లాసిక్ చిత్రాలను, బ్లాక్ బస్టర్ హిట్లను ప్రేక్షకులు మళ్లీ వెండితెరపై చూస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఇటీవల రీ-రిలీజ్ అయిన కొన్ని చిత్రాలకు ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోయినప్పటికీ, ఈ ట్రెండ్‌కు మాత్రం బ్రేకులు పడటం లేదు. ఈ క్రమంలోనే వచ్చే నెలలో జరుపుకోనున్న ‘ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులకు ఒక మధురమైన అనుభూతిని పంచేందుకు మరో సూపర్ హిట్ సినిమా సిద్ధమైంది. అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya), నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)జంటగా నటించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ 'లవ్ స్టోరీ'(Love Story)ని ఫిబ్రవరి 14న రీ-రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021లో కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకు వచ్చి పూర్వవైభవం తీసుకొచ్చింది. అప్పట్లో తక్కువ టికెట్ ధరలు, లిమిట్ పెట్టినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి, నాగచైతన్య కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రీ-రిలీజ్‌పై నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘‘నా హృదయానికి ఎంతో దగ్గరైన 'లవ్ స్టోరీ' మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. దీని కోసం నేను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను, మీ అందరితో కలిసి మళ్లీ సెలబ్రేట్ చేసుకోవాలనుంది’’ అని రాసుకొచ్చాడు. వాలెంటైన్స్ డే నాడు విడుదలవుతుండటంతో, యువత ఈ మ్యూజికల్ బ్లాక్ బస్టర్‌ను మరోసారి ఎంజాయ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

Read More..

రిలేషన్‌లో గొడవలు, విభేదాలు సహజం.. అక్కినేని కోడలు షాకింగ్ కామెంట్స్

Next Story