- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైతుతో 'దేవదాసు' చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్
by Chukka Sudharani |
దిశ, సినిమా : ఇప్పటికే ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య రీసెంట్‌గా ప్రముఖ దర్శకులు సంజయ్ లీలా భన్సాలీని కలిశాడు.

X
దిశ, సినిమా : ఇప్పటికే 'లాల్ సింగ్ చడ్డా' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య రీసెంట్‌గా ప్రముఖ దర్శకులు సంజయ్ లీలా భన్సాలీని కలిశాడు. ఈ డైరెక్టర్ ఆఫీస్ దగ్గర కనిపించిన చైతు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఆయన తాత అక్కినేని నాగేశ్వర్ రావు బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'దేవదాసు'ను రీమేక్ చేయాలని డైరెక్టర్‌ను కోరుతున్నారు ఫ్యాన్స్. సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తే మరో లెవెల్‌లో ఉంటుందని అభిప్రాయపడుతున్న ఫ్యాన్స్.. ఆ దర్శకుడితో ఒక్క సినిమాచేస్తే చాలు 'చై' రేంజ్ మారిపోతుందని అంటున్నారు. కచ్చితంగా బాలీవుడ్‌లో బిజీ అయిపోతాడని చెప్పుకుంటున్నారు.
Next Story






