వాళ్లు చేసిన క్షుద్రపూజల వల్లే నా భార్య అలా మాట్లాడింది.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన గోవింద

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-19 05:04:19  IST  )

90వ దశకంలో తన కామెడీ మరియు డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో గోవింద(Govinda)

వాళ్లు చేసిన క్షుద్రపూజల వల్లే నా భార్య అలా మాట్లాడింది.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన గోవింద
X

దిశ, సినిమా: 90వ దశకంలో తన కామెడీ మరియు డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో గోవింద(Govinda), ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా గోవింద తన భార్య సునీతా అహూజా(Sunita Ahuja)తో విడిపోతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో సునీత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. 63 ఏళ్లు వచ్చినప్పటికీ తన భర్త గోవింద ఎఫైర్లు పెట్టుకుని బాధ్యతలు మర్చిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే పెళ్లికి ఎదిగిన కూతురు టీనా ఉంది. కెరీర్ నిర్మించుకోవాల్సిన కొడుకు యష్ ఉన్నాడని.. అయినా గోవింద బుద్ధి మారలేదని చెప్పింది. తనను ఎప్పటికీ క్షమించను.

నేపాల్‌కి చెందిన బిడ్డని.. నేను గనుక (ఖుక్రీ) నేపాలీ కత్తి బయటకు తీశానంటే అందరి పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించింది. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు అని గోవిందకు వార్నింగ్ కూడా ఇవ్వడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా, ఈ వ్యాఖ్యలపై గోవింద్ స్పందించి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. అయితే, ఈ ఆరోపణలపై గోవింద స్పందిస్తూ ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తనపై గత 15 ఏళ్లుగా ఒక పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. "నేను మా ఇంట్లోని మహిళలకు ఎప్పుడూ ఎదురు చెప్పను. నా భార్య సొంతంగా యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టి తన అభిప్రాయాలను పంచుకుంటోంది. కానీ, ఆమె మాట్లాడుతున్న భాష చూస్తుంటే ఎవరో ఆమెను తప్పుదోవ పట్టిస్తున్నారనిపిస్తోంది.

నాపై ఎవరో క్షుద్ర ప్రయోగాలు చేస్తున్నారేమో అన్న అనుమానం కలుగుతోంది.వాళ్లు చేసిన క్షుద్రపూజల వల్లే నా భార్య నా ఎఫైర్ల గురించి అలా మాట్లాడింది అనిపిస్తోంది’’ అని గోవింద వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యులనే తనకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారని, తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక గోవింద కుటుంబ కలహాలు ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Read More..

ఏళ్లు వచ్చినా ఎఫైర్లు పెట్టుకున్నాడు.. ఇక నైనా బుద్ధి మార్చుకో.. గోవాందకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భార్య

Next Story