అయోధ్య ఆలయంలో ముస్లిం యువకుడు హల్‌చల్.. సరిగ్గా నమాజ్‌ టైమ్‌లో ఎంట్రీ ఇచ్చి..

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-10 11:20:33  IST  )

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో కశ్మీర్ యువకుడు అహ్మద్ షేక్ హల్‌చల్ చేశాడు.

అయోధ్య ఆలయంలో ముస్లిం యువకుడు హల్‌చల్.. సరిగ్గా నమాజ్‌ టైమ్‌లో ఎంట్రీ ఇచ్చి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandhir)లో కశ్మీర్ యువకుడు అహ్మద్ షేక్ హల్‌చల్ చేశాడు. శనివారం మధ్యాహ్నం సరిగ్గా నమాజ్ చదివే సమయంలో ఆలయంలోకి చొరబడ్డాడు. ఆలయంలోనే నమాజ్ చదవడానికి ప్రయత్నం చేశాడు. ఆలయ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగకుండా హడావిడి చేశాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అహ్మద్ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవలే అయోధ్య, పంచకోశి పరిక్రమ మార్గాల్లో మాంసాహారంపై నిషేధం విధించాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. స్థానికంగా మత, సంస్కృతి పరమైన పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే.. ప్రభుత్వ నిర్ణయంపై నిరసనగా కశ్మీర్ యువకుడు ఆలయంలోకి ప్రవేశించి నిరసన వ్యక్తం చేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story