- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రానైట్ రాయితో తల పగలగొట్టి హత్య.. పాతబస్తీలో కలకలం
పాతబస్తీలోని సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది.

దిశ, చంపాపేట్: పాతబస్తీలోని సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణ హత్య కలకలం రేపింది. రాజయ్యతోట ప్రాంతానికి చెందిన రాజు మేస్త్రి(45) అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన నాగ అనే వ్యక్తి గ్రానైట్ రాయితో దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సమాచారం అందుకున్న సంతోష్‌నగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీమ్ సభ్యులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రాథమిక విచారణలో వ్యక్తిగత విభేదాలే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటనకు గల పూర్తి కారణాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో రాజయ్యతోట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకోగా, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.






