'ఇరుముడి' తర్వాత మారుతీ దర్శకత్వంలో రవితేజ?

by Pulgam srinivas |

‘ఇరుముడి’ చిత్రం తర్వాత రవితేజ, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇరుముడి తర్వాత మారుతీ దర్శకత్వంలో రవితేజ?
X

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘ఇరుముడి’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన అయ్యప్ప స్వామి భక్తుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి చూస్తే ఈ సినిమా తండ్రి-కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ‘ఇరుముడి’ తర్వాత రవితేజ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నారనే అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

గత కొన్ని రోజులుగా రవితేజ, హాసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నారని, అనంతరం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో మరో ప్రాజెక్ట్ చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇరుముడి’ చిత్రీకరణ పూర్తైన వెంటనే మారుతితో రవితేజ ఓ సినిమా చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో రవితేజ తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉండబోతోందనే అంశం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story