వచ్చేనెల 11న మున్సిపల్ ఎన్నికలు.. ప్రభుత్వ వర్గాల్లో జోరుగా డిస్కషన్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తుది కసరత్తు పూర్తి చేసింది.

వచ్చేనెల 11న మున్సిపల్ ఎన్నికలు.. ప్రభుత్వ వర్గాల్లో జోరుగా డిస్కషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తుది కసరత్తు పూర్తి చేసింది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఓటింగ్‌లో సమస్యలు తలెత్తిన పోలింగ్ స్టేషన్లలో మరుసటి రోజు ఫిబ్రవరీ 12న రీ పోలింగ్ నిర్వహించి, ఓట్ల లెక్కింపును ఫిబ్రవరి 13న చేపట్టాలని ఈసీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈనెల 27న ప్రకటించే అవకాశం ఉంది.

శివరాత్రికి కొత్త పాలకవర్గాలు..

ఫిబ్రవరీ 15న శివరాత్రి పండుగ ఉంది. ఈలోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం టార్గెట్ పెట్టుకున్నది. అంటే పోలింగ్, కౌంటింగ్, నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకారం, చైర్మన్, మేయర్ ఎన్నికల ప్రక్రియ మొత్తం శివరాత్రి ముందు రోజే కంప్లీట్ చేసేవిధంగా ఈసీ తన షెడ్యూల్‌ను తయారు చేసుకున్నట్లు అధికార వర్గాల్లో చోరుగా ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగా ఈనెల 27న ఎన్నికల షెడ్యూలు ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. షెడ్యూలు ప్రకటించిన రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నోటీఫికేషన్ జారీ చేసి, అదే రోజు నుంచే నామినేషన్లను తీసుకునేవిధంగా ప్లాన్ చేసినట్లు తెలిసింది. అయితే ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 9 సాయంత్రం ముగియనుంది. 14వ తేదీన నూతన పాలక వర్గాలతో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, చైర్మన్, మేయర్ ఎన్నికలను సైతం పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎక్కడైన కోరం లేకుండా చైర్మన్, మేయర్ ఎన్నికలకు ఆటంకం ఏర్పడితే వాటికి ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ చూస్తున్నట్లు తెలిసింది.

Next Story