Municipal Elections: ఎన్నికల పరిశీలకులకు ట్రైనింగ్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-24 16:59:07  IST  )

మున్సిపల్ ఎన్నికలను పాదర్శకంగా నిర్వహించడానికి నిబద్దతతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని అన్నారు.

Municipal Elections: ఎన్నికల పరిశీలకులకు ట్రైనింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికలను పాదర్శకంగా నిర్వహించడానికి నిబద్దతతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు నిర్వర్తించాల్సిన విధుల గురించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసులో శనివారం శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. పరిశీలకులు చేపట్టాల్సిన విధులు, పాటించాల్సిన రూల్స్, ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ కమిషనర్ డాక్టర్ టీకే.శ్రీదేవి, రాష్ట్రఎన్నికల సంఘం కార్యదర్శి లింగ్యానాయక్ పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికల సందర్బంగా సిబ్బంది నియామకం, ఎన్నికల సామాగ్రి సమకూర్చడం, పోలింగ్ కేంద్రాల నిర్వహణ, ఇతర అంశాల గురించి 32 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని జిల్లాల కలెక్టర్లు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్ జారీచేయడమే తరువాయిగా మిగిలిందని అధికారులు చెబుతున్నారు.

Next Story