Municipal elections: చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్.. గుర్తులు తారుమారు కావడంతో ఓటింగ్ నిలిపివేత!

by Malleboina Mahesh |   (  Updated:2026-02-11 04:23:07  IST  )

ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్లకు ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. ఈ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

Municipal elections: చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్.. గుర్తులు తారుమారు కావడంతో ఓటింగ్ నిలిపివేత!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం అయింది. ఈ మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ (Municipal election polling)లో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 45వ డివిజన్‌లోని 5వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటింగ్ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయింది. పోలింగ్ మొదలైన కాసేపటికే అభ్యర్థుల గుర్తులు తారుమారై నట్లు గుర్తించడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. తమకు కేటాయించిన గుర్తులు ఒకరికి బదులు మరొకరికి ఉండటంతో అభ్యర్థులు, వారి అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

బ్యాలెట్ పేపర్లలో జరిగిన ఈ పెను పొరపాటుపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపిస్తూ పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. ఓటర్లు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇలాంటి 'షాకింగ్' సంఘటన ఎదురు కావడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పోలింగ్ సిబ్బంది తీరుపై అభ్యర్థులు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పొరపాటును గమనించిన ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి పోలింగ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.

వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత.. బోగస్ ఓట్లంటూ కాంగ్రెస్, BRS శ్రేణుల వాగ్వాదం

Next Story