- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 3 నుంచి సీఎం రేవంత్ ప్రచారం
by Kema Shiva Kumar |
తెలంగాణలోని ఏడు కొర్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ఏడు కొర్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 13 ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాలను వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఈ క్రమంలోనే మెజారిటీ స్థానాలకు కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ప్రతిపక్షాలకు గెలుపు అవకాశం ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డితో క్యాంపెయిన్‌కు ఆ పార్టీ తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 3న మిర్యాలగూడ సభతో రేవంత్ ప్రచారం ప్రారంభం కానుంది. అదేవిధంగా 4 జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో సీఎం రేవంత్ ప్రచార సభలు జరగనున్నాయి.
Next Story






