మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. ఏకంగా 47 మంది కమిషనర్ల బదిలీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-21 10:57:44  IST  )

రాష్ట్రంలో రానున్న రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. ఏకంగా 47 మంది కమిషనర్ల బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రానున్న రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్ల (Municipal Commissioners)ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ల బదిలీలకు సంబంధించింది పురపాలక పరిపాలన శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి (TK Sridevi) జీవో నెం.87ను విడుదల చేశారు. సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారు, ఒకేచోట సుదీర్ఘ కాలం పనిచేస్తున్న అధికారులను పరిపాలనా కారణాలతో పాటు పదోన్నతులపై మొత్తం 47 మందిని బదిలీ చేశారు.

అందులో సీ.వీ.ఎన్.రాజు ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3) నుంచి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. జి.రాజు క్యాతనపల్లి నుంచి ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇక ముసాబ్ అహ్మద్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా బి. శ్రీనివాస్ ఆలేరు నుంచి హుజూర్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా, డి. జైత్రమ్ పదోన్నతిపై జహీరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. చివరగా బి.శరత్ చంద్ర జీహెచ్‌ఎంసీ (GHMC) నుంచి ప్రమోషన్‌పై నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా వెళ్లనున్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాలని జాయింట్ డైరెక్టర్ నారాయణ రావు ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. విధుల్లో చేరడంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రస్తుత నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.




Next Story