- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WPL.. గుజరాత్ పై ముంబై ఘన విజయం
WPL 2026 సీజన్లో భాగంగా నేడు గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : WPL 2026 సీజన్లో భాగంగా నేడు గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో గుజరాత్ మీద ఘన విజయం సాధించింది. నవి ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులు చేసింది. ఇందులో సోఫీ డివైన్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ముంబై బౌలర్లలో ఇశా ఘోష్ 3 వికెట్లు తీసి మెరిసింది.
అనంతరం 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 17.2 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అజేయంగా 68 పరుగులు చేసి జట్టును విజయ తీరనినికి నడిపించింది. అద్భుత ఇన్నింగ్స్‌కు గాను హర్మన్‌ప్రీత్ కౌర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.






