IPL: ముంబై అభిమానులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి స్టార్ ప్లేయర్!

by Disha Web Desk 19 |
IPL: ముంబై అభిమానులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి స్టార్ ప్లేయర్!
X

దిశ, వెబ్‌డెస్క్: మార్చి 26న ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముగిసిన మ్యాచ్‌లు అభిమానులకు సరిపడా కిక్ ఇస్తు్న్నాయి. భారీ సిక్సర్లు, కళ్లు చెదిరే క్యాచ్‌లు, అద్భుతమైన బౌలింగ్‌‌తో ఐపీఎల్ ప్రియులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు.. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే షాక్ తగిలింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోయింది. అయితే, ముంబై అభిమానులకు MI డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ జహీర్ ఖాన్ గుడ్ న్యూస్ చెప్పారు. గాయం వల్ల తొలి మ్యాచ్‌కు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆర్ఆర్‌తో జరగబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపారు. గాయం నుంచి కోలుకున్న సూర్య కూమార్ యాదవ్ ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాడని అన్నారు. ముంబై శనివారం ఆర్ఆర్‌తో తలపడనుంది.


Next Story