WPL 2026: ముంబై ఇండియన్స్‌ సూపర్ విక్టరీ

by Gantepaka Srikanth |

మహిళల ప్రిమియర్‌ లీగ్‌ 2026 సీజన్‌లో భాగంగా ముంబై వేదికగా ముంబై వర్సెస్ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

WPL 2026: ముంబై ఇండియన్స్‌ సూపర్ విక్టరీ
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళల ప్రిమియర్‌ లీగ్‌ 2026 సీజన్‌లో భాగంగా ముంబై వేదికగా ముంబై వర్సెస్ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు ఘన విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (74), నాట్ స్కీవర్ బ్రంట్ (70) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. అనంతరం 196 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు తడబడింది. 19 ఓవర్లలో 145 పరుగులకే ఆలౌట్ అయింది.

ఢిల్లీ: షెఫాలీ వర్మ, లిజెల్లె లీ (వికెట్ కీపర్), లారా వాల్వార్డ్, జెమీమా రోడ్రిగ్స్‌ (కెప్టెన్), మారిజానె కాప్, నికీ ప్రసాద్, చినెల్లె హెన్రీ, స్నేహ్‌ రాణా, మిన్ను మణి, శ్రీ చరణి, నందని శర్మ.

ముంబై: అమెలియా కెర్, కమలిని (వికెట్ కీపర్), నాట్ స్కివెర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), నికోలా కారీ, సజీవన్ సజనా, అమన్‌జోత్ కౌర్, పూనమ్, త్రివేణి వశిష్ఠ, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా.

Next Story