- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి సీతక్కను కలిసిన ములుగు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు
by Batti.Sumithra |
కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన ఎండీ తాజుద్దీన్‌ను మంత్రి సీతక్క అధికారికంగా నియమించారు.

X
దిశ, ఏటూరు నాగారం: కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన ఎండీ తాజుద్దీన్‌ను మంత్రి సీతక్క అధికారికంగా నియమించారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎండీ తాజుద్దీన్ మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క, ములుగు డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ నూతన జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ తాజుద్దీన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. పార్టీ అభివృద్ధి, బలోపేతం కోసం సమర్థవంతంగా పని చేయాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఎండీ తాజుద్దీన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ములుగు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన మంత్రి సీతక్కకు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌కు, ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్‌కు, అలాగే జిల్లా, మండల, పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం, అలాగే కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి నిబద్ధతతో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story






