- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అతడితో ఉన్న ఫొటోలు షేర్ చేసిన మృణాల్.. రిలేషన్‌షిప్‌లో ఉందా?
సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సీత’గా చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur),

దిశ, సినిమా: సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘సీత’గా చెరగని ముద్ర వేసుకున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), ఇటీవల తన వ్యక్తిగత జీవితం, కొత్త ప్రాజెక్టులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush)తో ఆమె ప్రేమలో ఉందని, వీరిద్దరూ ఫిబ్రవరి 14న పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలపై మృణాల్ టీమ్ స్పందిస్తూ.. అవన్నీ కేవలం పుకార్లేనని, ప్రస్తుతం ఆమె పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని స్పష్టం చేసింది. ధనుష్ సైతం తన పెళ్లి గురించి వస్తున్న వార్తలను ఖండించారు.
ఈ పుకార్ల మధ్య మృణాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి దిగిన కొన్ని రొమాంటిక్ ఫోటోలను షేర్ చేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది నిజమైన రిలేషన్ కాదని, వారిద్దరూ కలిసి నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘దో దివానే సెహెర్ మే’ (Do Deewane Seher Mein) ప్రమోషన్స్‌లో భాగంగానే ఆ ఫోటోలను షేర్ చేసినట్లు తెలుస్తోంది. రవి ఉద్యవార్ దర్శకత్వంలో, సంజయ్ లీలా భన్సాలీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది.
ఈ చిత్రం ప్రేమికుల రోజు కానుకగా వచ్చే నెల ఫిబ్రవరి 20న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ 1977 నాటి క్లాసిక్ సాంగ్ ‘దో దివానే సెహెర్ మే’ రీమేక్ వెర్షన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అరుణ్ జాయ్ సేన్‌గుప్తా, ఆయేషా రజా, విరాజ్ గెహ్లానీ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాతో మృణాల్ బాలీవుడ్‌లో మరో భారీ హిట్ అందుకోవాలని ఆశిస్తోంది. ప్రస్తుతం ప్రేక్షకులంతా ఈ సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






